పున్నమి వెన్నెలలో తడిచి, తడిచి
ముద్దగా ముడుచుకుని ఉంటుంది పల్లె
వేట కోసం లేచిన వేకువ పిట్టలు
వేగుచుక్క దిశగా గాలిలో ఈదుతూ ఉంటాయి
తరతరాల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా
పల్లె నలుచెరుగులా కోడి కూతలు
రాత్రంతా మొరిగి మొరిగి ఏ అరుగుల కిందో
కునుకు తీస్తుంటాయి కుక్కలు
ఏమరుపాటెరుగని ఏరువాక గువ్వ
ఎగిసి ఎగిసి కూస్తూ ఉంటుంది
ఆకలి గొన్న లేగ దూడొకటి
ఆవు పొదుగుకేసి మోరతో కుమ్ముతూ
చెక్కిలిగింతలు పెడుతూంటుంది
ఆకలి గొన్న లేగ దూడొకటి
ఆవు పొదుగుకేసి మోరతో కుమ్ముతూ
చెక్కిలిగింతలు పెడుతూంటుంది
ఎద్దుల మెడార్ల గంటలు
శ్రావ్యంగా తాళం వేస్తుంటాయి
వాటి గిట్టల చప్పుడు ముందర
తబలా వాద్యమైనా బలాదూరనిపిస్తుంది
కాడిపై తిరగేసిన నాగలి
డొంక బాటపై జీరాడుతూ
డొంక బాటపై జీరాడుతూ
వాయులీనం మోగిస్తూ ఉంటుంది
మంచినీటి బోరు బొంగురు గొంతుతో
మూలుగు పాటను పాడుతూంటుంది
రాత్రంతా ఎక్కడ తిరిగాయో ఏమో
వేకువ జామున్నే పిల్లుల కాట్లాట
వామిదొడ్లోని వేపమాను చిటారుకొమ్మన
పక్షుల కువకువలు వినిపిస్తూ ఉంటాయి
పడమటి కోన నుంచి వీచే జాజిపూల గాలులు
ఊరి వీధులకు సుగంధాలను అద్దుతూ
ఊరి వీధులకు సుగంధాలను అద్దుతూ
తూరుపు కొండల దిశగా సాగిపోతుంటాయి
చీకటి నుంచి వేకువ లోకి
వేకువ నుంచి వెలుతురు లోకి
వేకువ నుంచి వెలుతురు లోకి
నా పల్లె సమాయత్తమవుతూ వుంటుంది
No comments:
Post a Comment